Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు

Published on Sun, 01/04/2026 - 01:15

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా , బీజాపూర్‌ జిల్లాల్లో శనివారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కుంట – కిష్టారం అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది చనిపోగా, బీజాపూర్‌ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందనే పక్కా సమాచారంతో పాలోడి – పూటుక్‌ పల్లి అటవీ ప్రాంతంలో సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ పర్యవేక్షణలో డీఆర్‌జీ బలగాలు గాలిస్తుండగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పావలూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉదయం 8 గంటల వరకు భీకరంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ప్రదేశం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. మరోవైపు బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గగన్‌పల్లి – మూర్కపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌లో కుంట ఏరియా కార్యదర్శి సచిన్‌ మంగ్డూతో పాటు కమిటీ సభ్యులు మృతి చెందారని సమాచారం. గతంలో కుంట ఏఎస్పీ ఆకాశ్‌రావు గిరిపుంజేను హత్య చేసిన మావోయిస్టు కమాండర్లు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు తెలిసింది. ఇక బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పామేడు ఏసీఎం మడకం హుంగా, ఏరియా కమిటీ సభ్యురాలు మడకం ముచ్చుకి మృతి చెందారు. 

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)