Breaking News

Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్‌ని అదే కాపాడిందా?

Published on Sat, 06/14/2025 - 13:15

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విస్వాస్‌ కుమార్ రమేష్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మిగిలిన 241 మంది మృతిచెందారు. దీంతో విస్వాస్‌ కుమార్ రమేష్ మృత్యుంజయుడని అంటున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ ‘11ఏ’ సీటులో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతిచెందగా, 40 ఏళ్ల వ్యాపారవేత్త విస్వాస్‌ కుమార్ రమేష్ శిథిలాల మధ్య నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. రక్తంతో తడిసిన షర్టుతో కనిపించాడు. తాను ఈ ప్రమాదం నుంచి దాని నుండి ఎలా సజీవంగా బయటపడ్డానో తనకే తెలియడం లేదని ఆయన  ‘దూరదర్శన్‌’కు చెప్పాడు.

రమేష్ ప్రాణాలతో బయటపడిన దరిమిలా అతను కూర్చున్న ‘11ఏ’ సీటు సురక్షితమైనదంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రమేష్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడంటూ చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విమానయాన నిపుణుడు అంగద్ సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. వివిధ విమాన ప్రమాదాల గణాంకాల ప్రకారం, విమానంలో కొన్ని సురక్షితమైన సీట్లు ఉంటాయి.  మధ్యలో ఉన్న సీట్ల కంటే చివర లేదా కుడి ముందు భాగంలో ఉన్న సీట్లు సురక్షితమైనవని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందుకు భిన్నంగా జరిగిందన్నారు. సీటు 11ఏ విమానం మధ్యలో, రెక్క ముందు ఉందన్నారు. ఈ ఘటన అద్భుతమని,  ఇంకా చెప్పేందుకు మరో పదం లేదన్నారు.

విమానాలకు సంబంధించి ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుందని, సీటు స్థానం ఆధారంగా  సురక్షితమనేది  తేల్చిచెప్పడం అసాధ్యమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్  పేర్కొన్నారు. కాగా మీడియా నివేదికల ప్రకారం 2007 పాపులర్ మెకానిక్స్ అధ్యయనం ప్రకారం విమానం వెనుక వైపు ఉన్న సీట్లు సురక్షితమైనవని తేలింది. కొంతమంది నిపుణులు రెక్కల దగ్గరుస్న సీట్లు సురక్షితమైనవని చెబుతుంటారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.

ఇది కూడా చదవండి: Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్‌ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట..

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)