Breaking News

తల్లి బదులు పది పరీక్షకు కూతురు!

Published on Sat, 04/05/2025 - 08:58

అన్నానగర్‌: తల్లికి బదులు పరీక్షకు హాజరైన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి 10వ తరగతి సాధారణ పరీక్ష జరుగుతోంది. నాగై వెలిప్పాలయం లోని నటరాజన్‌–దమయంతి పాఠశాలలో బుధవారం ఉదయం ఇంగ్లిష్‌ పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసి సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళ ముఖానికి మాస్క్‌ ధరించి ప్రత్యేకంగా కనిపించింది.

అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ మాస్క్‌ తీయమని మహిళను అడిగాడు. అనంతరం అడ్మిట్‌ కార్డును పరిశీలించారు. ఆ సమయంలో అడ్మిట్‌ కార్డు పై పరీక్ష రాస్తున్న మహిళ ఫొటోను చూశారు. అయితే పరీక్ష గది ఇన్విజిలేటర్‌ వద్ద ఉన్న హాజరు రిజిస్టర్‌ లో వేరే వ్యక్తి ఫొటో ఉంది. ఇన్విజిలేటర్‌కు మహిళను పరీక్ష కంట్రోల్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సుబాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి (స్పెషల్‌ ఎగ్జామినేషన్‌) ముత్తుచ్చామి, పరీక్షల నియంత్రణ సహాయ సంచాలకులకు సమాచారం అందించారు.

ఈ సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పోలీసులు వెళ్లి మహిళను విచారించారు. విచారణలో ఆమె నాగై వెలిప్పాలయానికి చెందిన సెల్వాంబికై (25) అని తేలింది. ఈమెకి పెళ్లి అయ్యిందని,  తల్లి సుగంతి కోసం మాస్క్‌ వేసుకొని హాజరైనట్లు తెలిసింది. అదేవిధంగా 28న మాస్క్‌ ధరించి తమిళ సబ్జెక్ట్‌ పరీక్ష రాసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)