Breaking News

మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు

Published on Tue, 10/22/2024 - 14:16

భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 100కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.

తాజాగా మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా  అంతర్జాతీయ మార్గాల్లో ఈ బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులు జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చినట్లు తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించింది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపి,తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానం, అహ్మదాబాద్ నుంచి జెద్దాకు వెళ్లే విమానం, లక్నో నుంచి పుణె, హైదరాబాద్‌ నుంచి జెడ్డా, ఇస్తాంబుల్‌ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి డమ్మాం, బెంగళూరు నుంచి జెడ్డా, ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీ, కోజికోడ్‌ నుంచి జెడ్డా, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లే విమానాలకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ... వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)