Breaking News

అది నా అదృష్టం – వైవీఎస్‌ చౌదరి

Published on Tue, 06/11/2024 - 11:20

‘‘నా కెరీర్‌లో ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేశాను. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్‌’ చిత్రంతో సాయిధరమ్‌ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశాను. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు దివంగత జానకి రామ్‌(ఎన్టీఆర్‌ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాని ప్రకటించారు వైవీఎస్‌ చౌదరి. న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. 

సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ–‘‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ మూవీతో దర్శకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి  రుణపడి ఉంటాను. తొలి సినిమాకే నాగేశ్వరరావుగారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాజాగా నా కొత్త సినిమాకి హీరోగా ఎవర్ని తీసుకోవాలి? అనుకుంటున్న సమయంలో తమ్ముల ప్రసన్న కుమార్‌గారు తారక రామారావుని చూపించారు. తనని చూడగానే జానకి రామ్‌ కలని నెరవేర్చుతాడనిపించింది. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు. 

‘‘మా స్నేహితులు, సన్నిహితుల అండదండలతో న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్‌పై ఫస్ట్‌  ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేయబోతున్నాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రమేష్‌ అత్తిలి. 

 

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్