Breaking News

ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్‌

Published on Sun, 06/23/2024 - 12:20

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో విజయ్‌ నటించిన గోట్‌ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్‌ భవతారిణి వాయిస్‌ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు.  వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన రెండో సాంగ్‌ గురించి యువన్‌శంకర్‌ రాజా ఎమోషనల్‌ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా  విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్‌ కూడా ఉంది.  ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి  వాయిస్‌ అయితే బాగుంటుందని భావించాను. 

ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్‌ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్‌ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్‌ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్‌శంకర్‌ రాజా ఎమోషనల్‌ అయ్యారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు  ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్‌ శంకర్‌రాజా, కార్తిక్‌ రాజాలాగే భవతారణి కూడా తండ్రి  ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్‌ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్‌ను మరోసారి అభిమానులకు అందించారు యువన్‌శంకర్‌ రాజా.  సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి