సూపర్‌ స్టార్‌ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి

Published on Sat, 11/15/2025 - 17:02

తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ(krishna ghattamaneni). దాదాపు యాభై ఏళ్ల పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడు లోకాన్ని వీడి అప్పుడే మూడేళ్లు గడిచింది. నేడు(నవంబర్‌ 15) ఆయన  వర్ధంతి . ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ కృష్ణకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులు అర్పిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.

‘తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న గొప్ప‌ న‌టుడు పద్మభూషణ్ సూప‌ర్ స్టార్‌ కృష్ణ గారు. ఎప్పుడూ  కొత్త‌దనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయ‌న‌. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది.  కృష్ణ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

1965లో 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయమై కృష్ణ, 350కు పైగా చిత్రాల్లో నటించారు. కౌబాయ్, జేమ్స్ బాండ్, రాబిన్ హుడ్ వంటి హాలీవుడ్ శైలి సినిమాలను తెలుగులో పరిచయం చేసి, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించిన మొదటి తెలుగు నటుడిగా గుర్తింపు పొందారు. 2022 నవంబర్ 15న కృష్ణ కన్నుమూశారు. 
 

 

Videos

Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు

Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి

Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

Jada Sravan: పవన్ అలా చేస్తే సెల్యూట్ చేస్తా..

స్టీల్ ప్లాంట్పై విషం కక్కిన బాబు..వివాదాస్పద వ్యాఖ్యలు

మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్

YSRCP ఆఫీస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Photos

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)