Breaking News

‘యూత్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 03/27/2026 - 09:39

టైటిల్‌: యూత్‌
నటీనటులు: కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులు
నిర్మాతలు: కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్
దర్శకత్వం: కెన్ అండ్ గ్యాంగ్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటర్‌: నాష్
విడుదల తేది: నవంబర్‌ 27, 2026

కెన్‌ కరుణాస్‌.. చైల్డ్‌ ఆరిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి.. హీరోగా మారాడు.  ‘వాతీ’, ‘తిరుచిత్రంబలం’, ‘అసురన్’ లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గాను చేశాడు. ఆయన హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం యూత్‌.  ఈ మూవీ ఈ నెల 19న తమిళ్‌లో విడుదలై హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది.  ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తమిళ్‌ మాదిరే ఇక్కడ కూడా విజయం సాధిస్తుందా?  లేదా? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
ప్రవీణ్‌ (కెన్‌ కరుణాస్‌) ఓ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్‌ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్‌ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్‌లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్‌లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్‌ కుమార్‌), ప్రేషిక (మీనాక్షి దినేష్‌), సోనాల్‌ (ప్రియాన్షీ యాదవ్‌).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్‌ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్‌, అవమానాలతో ప్రవీణ్‌ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్‌ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంచే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
కాలేజీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ చిత్రం కూడా అదే కోవకు చెందింది.  తెలిసి తెలియని వయసులో ఓ కుర్రాడు  ప్రేమ కోసం పాకులాడి.. చివరకు పరిణితి చెందిన వ్యక్తిగా ఎలా మారాడనేది ఈ సినిమా ఇతివృత్తం. దానికి చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కెన్‌ కరుణాస్‌. రొటీన్‌ కథే అయినా..  నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ముఖ్యంగా జెంజీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.  టీనేజ్‌లో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? తెలిసి తెలియక చేసే తప్పులు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఈ చిత్రంలో చాలా నేచురల్‌గా చూపించారు. 

ఫస్టాఫ్‌ మొత్తం చాలా హిలేరియస్‌గా సాగుతుంది.  హీరో కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు.  ఫస్ట్‌ సీన్‌ నుంచే నవ్వించే ప్రయత్నం చేశాడు.  హీరో టెన్త్‌ పాస్‌ అయి.. ఇంటర్‌లో జాయిన్‌ అయినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. అమ్మాయిల వెంటపడి ఛీ కొట్టించుకునే హీరో జీవితంలోకి ప్రేషిక రావడం..ఆమెతో ప్రేమలో పడిన వెంటనే మరో అమ్మాయి రావడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు, తన బ్యాచ్‌ ముందు ఇచ్చే బిల్డప్పులు..ప్రతీది నవ్వులు పూయిస్తుంది. జెంజీ కిడ్‌ అయితే హీరో పాత్రకు ఈజీగా కనెక్ట్‌ అయిపోతాడు.  ఇంటర్వెల్‌ ముందు వచ్చే బ్రేకప్‌ సీన్‌  ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది.  కాలేజీ టూర్‌, గంగవల్లితో పరిచయం.. ఆమె ప్రేమ కోసం హీరో పరితపించడం.. ఇదంతా కామెడీగానే సాగుతుంది.  హీరో తల్లి అనారోగ్యానికి గురి అయినప్పటి నుంచి కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రీ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది.  క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
దర్శకుడిగా, హీరోగా కెన్‌ కరుణాస్‌.. కొంతమేర సక్సెస్‌ అయ్యాడు. రొటీన్‌ కథనే ఎంచుకున్నా.. యూత్‌కి నచ్చే సీన్లతో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథనాన్ని నడిపించాడు. ప్రవీణ్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్లు ముగ్గురూ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. హీరో తల్లిదండ్రులుగా సూరజ్, దేవదర్శిని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు వీరిద్దరి పాత్రలు చాలా కీలకమైనవే. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

Videos

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు

రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన

తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)