రిప్లై ఇవ్వకపోతే చేయి చేసుకుంటా..హీరో కార్తికేయకు యువతి బెదిరింపు!

Published on Sat, 08/26/2023 - 18:21

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ఖాతాలోకి ఎట్టకేలకు ఓ హిట్‌ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ముందు నుంచి ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా కూడా తన సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు.

(చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ)

ఎట్టకేలకు ఆగస్ట్‌ 25న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ గురించి చెప్పమని ఓ నెటిజన్‌ అడగ్గా.. లక్కీ ఛార్మ్‌ బదులిచ్చాడు. చరణ్‌ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా.. మంచి స్కోప్‌ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానన్నాడు.

ఈ క్రమంలోనే ఓ యువతి ట్విటర్‌ వేదికగా కార్తికేయను బెదిరించింది.  రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది  చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్‌ మెయిల్‌ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్‌ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కామెడీ బ్లాక్‌ మెయిల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)