Breaking News

రెబెకా వచ్చేశారు

Published on Sun, 01/04/2026 - 00:08

‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యష్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్‌ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా గీతూ మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ–‘‘తారా సుతారియా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘టాక్సిక్‌’. ఆమె కెరీర్‌లో ఇదొక కొత్త అధ్యాయం. తను ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. రెబెకా పాత్రలో తను జీవించింది. తన నటన నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులనూ ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’’ అని చెప్పారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)