Breaking News

Yamudu Teaser: అమ్మాయిల మిస్సింగ్‌తో యముడికి ఉన్న సంబంధం ఏంటి?

Published on Thu, 05/29/2025 - 17:07

ప్రస్తుతం ఆడియన్స్ రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యముడు’. ఈ సినిమాకి ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక ఉంది. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

తాజాగా ‘యముడు’ టీజర్‌ను గురువారం ప్రముఖ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్‌ను చూసిన తర్వాత ఆయన చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ టీజర్ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌ల మిశ్రమంగా ఉంది. సిటీలో అమ్మాయిలు అదృశ్యమవుతున్న కేసులు, నాటకాల్లో యముడి వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలతో సంబంధం ఉందేమో అనే సూచన టీజర్‌లో కనిపిస్తుంది. యముడు భూలోకానికి వచ్చి నరకంలో విధించే శిక్షలను ఇక్కడే అమలు చేస్తున్నాడా అనే ఆలోచన కలిగిస్తుంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథంతో సినిమాను తీర్చిదిద్దినట్లు సూచిస్తోంది. హిందూ ధర్మం నుంచి ఒక నూతన కోణాన్ని ఆసక్తికరంగా అందించేలా ఈ చిత్రం ఉంటుందని టీజర్ చూస్తే అనిపిస్తుంది. విష్ణు రెడ్డి వంగా సినిమాటోగ్రఫీ, భవాని రాకేష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి