Breaking News

నాపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి: విశాల్‌

Published on Sun, 08/11/2024 - 00:19

‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్‌ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్‌ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్‌తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.

దీనిపై విశాల్‌ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్‌ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.

కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్‌.     – సాక్షి, చెన్నై

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)