Breaking News

Ashish Vidyarthi: ఆ బాధ్యత మాదే

Published on Sun, 01/22/2023 - 05:07

‘‘తోటి నటీనటులతో పాటు యాక్ట్‌ చేస్తూ, నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాననే విషయంపై మాత్రమే నేను దృష్టి పెడతాను. అంతేకానీ ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు చూడను’’ అన్నారు నటుడు ఆశిష్‌ విద్యార్థి. సుహాస్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో జి. మనోహర్‌ సమర్పణలో అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

ఈ చిత్రంలో కీ రోల్‌ చేసిన నటుడు ఆశిష్‌ విద్యార్థి మాట్లాడుతూ– ‘‘మంచి హ్యూమర్, ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకు ఏదో సాధిస్తాడని ఆశపడే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించాను. కానీ ఈ తండ్రి జీవితంలో ఓ ట్విస్ట్‌ ఉంటుంది. ఈ సినిమాలో నాకు, రోహిణీగారికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చేసే ప్రతి పాత్రను నేను డ్రీమ్‌ రోల్‌గానే భావిస్తాను. మొదట్లో విలన్‌ రోల్స్‌ చేశాను. అయితే నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. అయితే మనకు ఎటువంటి పాత్రలు ఇవ్వాలనేది దర్శక–రచయితలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు మేం న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించే బాధ్యత మా ఆర్టిస్టులదే’’ అని అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)