Breaking News

ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Published on Wed, 04/23/2025 - 15:12

'పాడుతా తీయగా'(Padutha Theeyaga) ప్రోగ్రాంకి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya) అనే సింగర్ చేసిన ఆరోపణల కారణంగా మాయని మచ్చ ఏర్పడింది. జడ్జిలైన కీరవాణి, చంద్రబోస్, సునీత తనని అన్యాయంగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని ఈమె ఆరోపిస్తుంది. ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకుంటూ వివరణలు ఇచ్చుకుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి)

ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్
పూర్తి పేరు ప్రవస్తి ఆరాధ్య. తెలుగమ్మాయే. ముద్దుగా రైనో అని కూడా పిలుస్తుంటారు. 2006 డిసెంబరు 9న పుట్టింది. అంటే ప్రస్తుతం ఈమె వయసు 19 ఏళ్లు. 2011లో ఐదేళ్లకే పాడటం మొదలుపెట్టింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే పోటీలో పాల్గొని విజేతగానూ నిలిచింది.

తెలుగుతో పాటు తమిళ సింగింగ్ రియాలిటీ షోల్లో పాల్గొని ప్రవస్తి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ షోలో పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చింది. ఇక గతేడాది తెలుగులో సూపర్ సింగర్ పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.

(ఇదీ చదవండి: కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక)

ఇప్పుడే కాదు చిన్నతంలోనూ 'పాడుతా తీయగా' ప్రోగ్రాంలో పాల్గొంది. అప్పటి జడ్జిలైన ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Balu) నుంచి ప్రశంసలు అందుకుంది. వీళ్లిద్దరి ప్రోత్సాహం వల్లే సంగీత రంగంలో రాణించాలనుకుంది. కానీ తాజాగా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షో నుంచి ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది.

తను బాగానే ఫెర్ఫార్మ్ చేసినప్పటికీ జడ్జిలు కీరవాణి, సునీత(Singer Sunitha), చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని, టార్గెట్ చేశారని సంచలన వీడియో రిలీజ్ చేసింది. తన ఇకపై గాయనిగా కొనసాగాలనుకోవట్లేదని కూడా కుండబద్ధలు కొట్టేసింది. మరి నిజంగా ఈ మాటపై నిలబడుతుందా? అసలు ఈ గొడవకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)