Breaking News

శ్రీమంతుడు వివాదం.. తెరపైకి రూ. 15 లక్షల టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

Published on Fri, 02/02/2024 - 07:44

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు- కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది.  కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్ర యూనిట్‌ రియాక్ట్‌ అయింది. శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ యూనిట్‌ విజ్ఞప్తి చేసింది.

శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చేంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఎంటో తెలుస్తోంది. ఈ వ్వవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

రూ. 15 లక్షలు ఇస్తామన్నారు: శరత్‌
ఈ వివాదంపై రచయిత శరత్‌ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ' 2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. దీంతో ఇదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా  మొదలు పెట్టాలనుకున్న సమయంలో 'శ్రీమంతుడు' థియేటర్‌లోకి వచ్చేసింది.

ఆ సమయంలో నా స్నేహితులు కొందరు సనిమా చూసి అది నా కథే అని చెప్పడంతో నేను కూడా వెళ్లి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్‌తో మాట్లాడాను కూడా ఈ కథ నాదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఎంటర్‌ అయ్యారు. రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ వివాదంలో  రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వారి సాయంతోనే కోర్టు మెట్లెక్కాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను.' అని శరత్‌ చంద్ర పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)