Breaking News

పోర్నోగ్రఫితో గ్లోబల్ వార్మింగ్.. నటుడి వ్యాఖ్యలు వైరల్‌

Published on Tue, 07/21/2026 - 15:02

టెలివిజన్ ప్రముఖ నటుడు అభినవ్ శుక్లా వాతావరణ మార్పులపై చేసిన వినూత్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. పోర్న్‌ వీడియోలు చూడటం వల్ల గ్లోబల్ వార్మింగ్  పెరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య రుబినా దిలైక్, ప్రముఖ నటి హినా ఖాన్, ఆమె భాగస్వామి రాకీ జైస్వాల్‌లతో కలిసి నిర్వహిస్తున్న 'ది4పీవోవీ' (the4POV) పొడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

పోడ్‌కాస్ట్‌లో అసలు ఏం జరిగింది?
పోడ్‌కాస్ట్ సంభాషణలో భాగంగా నటి దియా మీర్జా గతంలో పర్యావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యల గురించి చర్చిస్తున్న సమయంలో అభినవ్ ఈ విషయాన్ని లేవనెత్తారు.  గ్లోబల్ వార్మింగ్‌కు ఉన్న అనేక కారణాల్లో పోర్న్ చూడటం కూడా ఒక ప్రధాన కారణం. అడల్ట్ కంటెంట్‌ను భారీ స్థాయిలో ప్రొడక్షన్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆన్‌లైన్ డేటా, సర్వర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి భారీ ఎత్తున విద్యుత్ శక్తి ఖర్చవుతుందని, ఇది పెద్ద మొత్తంలో కార్బన్ ఫుట్‌ప్రింట్ కు దారితీస్తుందని ఆయన వివరించారు.ఆయన వ్యాఖ్యలకు పొడ్‌కాస్ట్‌లో ఉన్న రుబినా దిలైక్‌తో పాటు, హినా ఖాన్, రాకీ జైస్వాల్ షాకయ్యారు.

చాలా ప్రమాదకరం..
కేవలం వాతావరణ ప్రభావమే కాకుండా, పోర్నోగ్రఫీ వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలపైనా అభినవ్ స్పందించారు. ‘పోర్న్ చూడటం చాలా ప్రమాదకరం. ఇది వాస్తవ జీవితంపై అవాస్తవికమైన అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పురుషులలో ఆత్మవిశ్వాసాన్ని  దెబ్బతీస్తుంది. సమయాన్ని వృథా చేస్తుంది’ అని అభినవ్‌ అన్నారు. డిజిటల్ వినియోగం-వాతావరణ మార్పుల మధ్య ఉన్న సంబంధంపై అభినవ్ చేసిన ఈ విచిత్రమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 

కొంతమంది నెటిజన్స్‌ అభినవ్‌కు మద్దతుగా కామెంట్స్‌ చేస్తుంటే..మరికొంతమంది ఆయన వాదనను తోసిపుచ్చుతూన్నారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఏదైనా డేటా వినియోగిస్తుందని, కేవలం ఒకే రకమైన కంటెంట్‌ను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ వార్మింగ్‌కు ముడిపెట్టడం విచిత్రంగా ఉందంటూ మరికొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. డేటా సెంటర్లు, డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయనే సాంకేతిక కోణాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)