‘వాల్తేరు వీరయ్య’మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 01/13/2023 - 07:03

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్‌ఫాదర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చిరంజీవి నటించిన చిత్రంకావడం.. అందులో రవితేజ కీలక పాత్ర పోషించడంతో ‘వాల్తేరు వీరయ్య’పై తొలి నుంచే హైప్‌ క్రియేట్‌ అయింది. ఇక పాటలు, టీజర్‌ కూడా అదిరిపోయాయి.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగాస్టార్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వాల్తేరు వీరయ్య ఫస్ట్‌ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్‌లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదుర్స్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ ర్యాంప్‌, ఇంట్రో, బాస్‌ పార్టీ సాంగ్‌, కామెడీ, ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌ యావరేజ్‌ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్‌ బాగున్నాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

వాల్తేరు వీరయ్య యావరేజ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. సినిమాను చిరంజీవి తన భూజాన వేసుకొని నడిపించారని చెబుతున్నారు. రవితేజతో వచ్చే కొన్ని సీన్స్‌ ఆకట్టుకుంటాయి. కామెడీ బాగుంది కానీ ఎమోషనల్‌ సీన్స్‌ వర్కౌట్‌ కాలేదని కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)