బాక్సాఫీస్‌పై ‘వీరయ్య’ వీరంగం.. 9 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Sun, 01/22/2023 - 16:10

జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయింది. కాని మెగాస్టార్ చిరంజీవి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పూనకాలు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండక్కి బాస్ వస్తే బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతుందని ఈ చిత్రం ద్వారా మరో సారి ప్రూవ్ అయింది.

తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వీరయ్య... తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల  గ్రాస్‌(106 కోట్ల షేర్‌) వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా పరిశీలిస్తే.. నైజాంలో  రూ.28.87కోట్లు, సీడెడ్‌లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. 

ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో సైతం వాల్తేరు వీరయ్య మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో చిరు జోరు కొనసాగుతోంది. అక్కడ కూడా వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ పడితే అనకాపల్లి టు అమెరికా పూనకాలు కామన్ అనే విషయాన్ని మరోసారి నిజం చేసింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)