చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'కు 365 రోజులు.. ఎక్కడో తెలుసా..?

Published on Tue, 01/09/2024 - 09:48

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి  హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్‌ హిట్‌గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్‌, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో గతేడాది అత్యధిక కలెక్షన్స్‌ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. 

ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్‌లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్‌ వద్ద మినిమమ్‌ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్‌ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేయనుంది.

నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్‌లో మెగా ఫ్యాన్స్‌ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు.  'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)