Breaking News

మీకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమా.. అయితే మీ కోసమే ప్రత్యేక ఛానెల్!

Published on Mon, 07/03/2023 - 14:54

యూట్యూబ్‌లో మనం రోజు మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్ ఇలా ప్రతి రోజు ఎదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్  తెలుగు సాంగ్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు. ఇటీవల ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న వేళ 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన  దర్శకులు  నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్  మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ హాజరయ్యారు. 

(ఇది చదవండి: ప్రభాస్‌ 'సలార్‌' టీజర్‌ అఫీషియల్ ప్రకటన ఇదే)

ఈ మ్యూజిక్ ఛానెల్‌ ద్వారా సంగీత ప్రియులను, అన్ని వర్గాల  ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించనున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్‌పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో  షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను రిలీజ్ చేశారు.  

దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ.. 'ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్‌లా సినిమా చూస్తున్నట్లే  ఉన్నాయి.  సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఛానెల్ ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొత్త వాళ్లయినా ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద  బెస్ట్.' అని అన్నారు.

(ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్‌)

సంగీత దర్శకులు  ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక గుర్తింపు తీసుకొస్తున్న ఉపేంద్ర, దేవి ప్రసాద్‌కు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)