Breaking News

నా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చేశాను 

Published on Thu, 10/30/2025 - 01:08

హిందీ ‘రామాయణ’ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలిపారు వివేక్‌ ఓబెరాయ్‌. రామాయణం ఆధారంగా నితీష్‌ తివారి దర్శకత్వంలో హిందీలో రెండు భాగాలుగా ‘రామాయణ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో వివేక్‌ ఓబెరాయ్‌ కూడా నటిస్తున్నారు. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో నిర్మాత నమిత్‌ మల్హోత్రా భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్తున్నారు. ఇది నచ్చి, ఈ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నా పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశాను.

 ఇక ‘రామాయణ’ సినిమా కోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. నితీష్, నమిత్, రకుల్‌లతో వర్క్‌ చేయడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు వివేక్‌ ఓబెరాయ్‌. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారని, ఆమె భర్త విద్యుజ్జీహ్యుడుగా వివేక్‌ ఓబెరాయ్‌ నటిస్తున్నారని సమాచారం. ‘రామాయణ’ తొలి భాగాన్ని 2026 దీపావళికి, ‘రామాయణ: పార్టు 2’ని 2027 దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)