Breaking News

'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..

Published on Tue, 12/30/2025 - 07:51

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న  సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ 'విశ్వంభర'..  వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో గేమ్‌ ఛేంజర్‌ కోసం చిరు వాయిదా వేసుకున్నారు. అపై  టీజర్ విషయంలో ఫ్యాన్స్‌ కూడా చాలా నిరాశ చెందడంతో వాయిదానే బెటర్‌ అనుకున్నారు. అందులో గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా పేలవంగా ఉందని విమర్శలు రావడంతో  మార్పులు చేయాలనుకున్నారు. అయితే, ఎప్పుడు రిలీజ్‌ అనేది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో  'మన శంకర వరప్రసాద్ గారు'  లైన్‌లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో విడుదల కూడా కానుంది. కానీ, విశ్వంభర గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

'విశ్వంభర' టీజర్‌ విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లాన్‌తో ఈ ఏడాది మొత్తం విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం కేటాయించి బలమైన ఔట్‌పుట్‌ను ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌పై విస్తృతంగా పరిశీలించి అనేక మార్పులు చేశారట. అయితే, తాజా నివేదికల ప్రకారం 'విశ్వంభర'  జూన్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 2026లో వస్తున్నందున, రెండు విడుదలల మధ్య ఆరోగ్యకరమైన అంతరాన్ని కొనసాగించాలని మేకర్స్‌ ఉన్నారట. విశ్వంభర తుది అవుట్‌పుట్‌ను మెగాస్టార్ ఆమోదించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే టాప్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించాలని వశిష్ఠ తన ప్లాన్‌ మార్చుకున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)