Breaking News

చీర, హై హిల్స్ వేసుకొని ఫైట్ చేశా: విశ్వక్‌ సేన్‌

Published on Wed, 02/12/2025 - 13:29

‘ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ‘లైలా’ చేయడం జరిగింది’ అని అన్నారు హీరో విశ్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ తొలిసారి ఈ సినిమా కోసం లేడీ గెటప్‌ వేశాడు. మెకప్‌కే దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.చాలా నేచురల్ గా వచ్చింది. 

→ లైలా క్యారెక్టర్ లో ఫైట్ కూడా చేశాను. చీర, హై హిల్స్ లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని ఒక స్టైల్ లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

→ లైలా పాత్రతో పాటు సోను మోడల్‌ క్యారెక్టర్‌ కూడా అందరికి నచ్చుతుంది.  పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్ ని కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ లో సోను మోడల్ లైఫ్ స్టైల్ ని తన క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.

→ డైరెక్టర్‌ కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇది అడల్ట్ సినిమా కాదు. యూత్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.

→ ఈ సినిమాకి లిరిక్స్ రాశాను.‘మొహమాటం ఏమీ లేదు. నేను రాస్తాను. బాగుంటే పెట్టుకోండి ’అని డైరెక్టర్ తో చెప్పాను.ఆయనకిపెట్టడం జరిగింది. నాకు రాయడం ఇష్టం.

→ లైలా గెటప్ లో నన్ను చూసి ఇంట్లో వాళ్లు  చాలా ఎంజాయ్ చేశారు. నవ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి. మా అక్క మమ్మీ మ్యాచింగ్ చీరలు కట్టుకొని షూటింగ్‌కి వచ్చారు(నవ్వుతూ..)

→ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి గారు.. లైలాని చూడగానే నాకే కొరకాలనిపిస్తుందని' చెప్పడం  బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుందనే నమ్మకంతో చేశాను.

→ లైలాని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. అయితే లైలా గెటప్ మళ్ళీ వెయ్యాలని ఉంది. ఇందులో సీక్వెల్ కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ ఉంది. మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో యాడ్ చేస్తాం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)