Breaking News

ఆరేళ్లు తీసిన సినిమా.. స్టార్ హీరోకి నో రెమ్యునరేషన్.. కారణమదే

Published on Sun, 03/03/2024 - 13:29

ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కమర్షియల్ కథల్ని చాలావరకు పక్కనబెట్టి సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ తీస్తున్నారు. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమా 'గామి'. దాదాపు ఆరేళ్ల పాటు ఈ మూవీ కోసం పనిచేసిన విశ్వక్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకు కారణమేంటనేది కూడా చెప్పాడు.

విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హాలీవుడ్ సినిమాల రేంజులో ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)

విశ్వక్ సేన్ ఇంకా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని టైంలో అంటే 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో కేవలం రూ.25 లక్షల పెట్టుబడితో మాత్రమే ఈ మూవీ తీయాలనేది ప్లాన్. కానీ దాదాపు ఆరేళ్ల పాటు అడపాదడపా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే పనిచేసినందుకు డబ్బులు తీసుకుంటే.. మూవీ బడ్జెట్ పెరిగిపోద్ది అనే ఉద్దేశంతోనే తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్‌లో చెప్పాడు.

అయితే 'గామి' కోసం రెమ్యునరేషన్ తీసుకోనప్పటికీ.. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడని సగటు ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా ఆరేళ్ల పాటు ఓ సినిమా కోసం కష్టపడి పారితోషికం తీసుకోకపోవడమనేది ఆసక్తకర విషయమే. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)