Vishwak Sen: అఘోరా అనుకొని ధర్మం చేశారు!

Published on Thu, 02/08/2024 - 04:12

‘‘గామి’ సినిమా షూటింగ్‌ని వారణాసిలోని కుంభమేళాలో జరిపినప్పుడు నేను నిజమైన అఘోరా అనుకొని కొందరు ధర్మం చేశారు. అక్కడ చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ వృద్ధురాలు భోజనం పెట్టి, టీ ఇచ్చింది. ‘గామి’ ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మునుపెన్నడూ కలిగించని సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. ఆయన హీరోగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి కథానాయిక.

వి సెల్యులాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘గామి’ కోసం దాదాపు నాలుగున్నరేళ్లు పని చేశాం. ఇంత సమయం పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ని రాబట్టుకున్నాం’’ అన్నారు. ‘‘మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా కోసం వారణాసిలో కుంభమేళా షూటింగ్‌ చేశాం. మైనస్‌ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండా నటించాడు విశ్వక్‌’’ అన్నారు విద్యాధర్‌ కాగిత. ‘‘2018లో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్‌ ఫండ్‌ మోడల్‌లో చేశాం’’ అన్నారు కార్తీక్‌ శబరీష్‌.
∙విశ్వక్‌ సేన్,
చాందినీ చౌదరి

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు