Breaking News

'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?

Published on Thu, 07/27/2023 - 07:48

'బేబీ' సినిమా జోరు తగ్గట్లలేదు. ఓ గొడవ ఇంకా చల్లారట్లేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ.. 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విషయంలో ఓ వివాదం ప్రస్తుతం మరింతగా ముదురుతోంది. మొన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు పరోక్షంగా హీరో విశ్వక్‌సేన్ వాటికి కౌంటర్స్ వేశాడు.

(ఇదీ చదవండి: అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!)

ఏం జరిగింది?
'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' తదితర చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న సాయి రాజేశ్.. 'కలర్ ఫొటో' సినిమాని నిర్మించాడు. అలా కొంతలో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'బేబీ' స్టోరీని రెడీ చేసి హీరో విశ్వక్ సేన్‌ని అప్రోచ్ అయ్యాడట. ఆ దర్శకుడు అయితే కనీసం స్టోరీ కూడా విననని సదరు హీరో అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్.. 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చెప్పుకొచ్చాడు. కాకపోతే ఓ హీరో అని అన్నాడు తప్పితే అది విశ్వక్‌సేన్ అని బయటపెట్టలేదు.

ట్వీట్ వార్
దీని తర్వాత విశ్వక్ సేన్.. బేబీ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ ట్వీట్ పెట్టాడు. 'నో అంటే నో. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి, అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్' అని అందులో రాసుకొచ్చాడు. దీనిపై దర్శకుడు సాయి రాజేశ్ పరోక్షంగా మరో ట‍్వీట్ తో స్పందించాడు. ఇదలా ఉండగానే ఇప్పుడు ఓ మూవీ ఈవెంట్‌లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే)

విశ్వక్ ఏం చెప్పాడు?
'ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలా 'కలవలేం, కథ వినలేం' అని చెబుతుంటాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. ఈ విషయంలో నేనేం చేయలేను. అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీని కాదు. సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ కించపరచొద్దు. అదొక్కటే బాధగా ఉంది' 

'చిన్న సినిమా ఇలా హిట్ కావడం ఆనందించే విషయం. వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పాను. మూవీ బాగుందని డైరెక్టర్స్ గ్రూప్ లో ముందు నేనే మెసేజ్ చేశాను. అయినా డైరెక్టర్‌ని కలవలేదని మీమ్స్ వచ్చాయి. గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప‍్పాను' అని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని తేల‍్చుకోవాల్సింది పోయి, ఇలా బయటపెట్టుకుని ఇద్దరు పొరపాటు చేశారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

(ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!)

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)