Breaking News

విశాల్‌ దెబ్బతో అక్కడ మొదలైన ప్రకంపనలు

Published on Wed, 10/04/2023 - 11:21

సౌత్‌ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్‌ కోసం సెన్సార్‌ బోర్డ్‌ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. విశాల్‌ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని, త్వరలోనే విచారణ చేపడుతామని ఒక సీనియర్‌ అధికారిని ముంబైకి కూడా పంపించింది. తర్వాత విశాల్‌ కూడా ఈ విషయాన్ని అంతటితో ఆపేశాడు.

(ఇదీ చదవండి: 'పవన్‌ కల్యాణ్‌ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్‌ తిరిగి నిలబెట్టాడు')

ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో కూడా సెన్సార్‌ బోర్డు అధికారులపై పలు విమర్శలు రావడంతో..  కేంద్ర స్థాయిలో  సెన్సార్ బోర్డు మీద వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాల్ ఆరోపణలపై చర్చించారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు సమాచారం.

త్వరలో అన్ని రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. విశాల్‌ చేసిన ఆరోపణలు నేషనల్‌ మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో దేశం మొత్తం సంచలనంగా మారింది. దీంతో ముంబై సెన్సార్‌ బోర్డులో కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికి విశాల్‌ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

Videos

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి కుటుంబం.. మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)