Breaking News

‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..

Published on Sat, 04/22/2023 - 13:17

సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 21న విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంది. కార్తీక్‌ దండు రాసుకున్న కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ.. సుకుమార్‌ స్క్రీన్‌ప్లే సినిమాను నిలబెట్టింది. అలాగే అజనీష్‌ లోక్‌నాథ్‌ నేపథ్యం సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఇక ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. . ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల షేర్‌, 8.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

(చదవండి: విరూపాక్ష మూవీ రివ్యూ)

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.35కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. ఇక ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో అత్యధికంగా రూ.1.82 కోట్లు, వైజాగ్‌ రూ.58లక్షలు, సీడెడ్‌ రూ. 54 లక్షలు, గుంటూరు రూ. 46 లక్షలు, నెల్లూరు రూ. 20 లక్షలు, కృష్ణా రూ. 32 లక్షలు, వెస్ట్‌ రూ. 47 లక్షలు, ఈస్ట్‌ రూ.40 లక్షలు కలెక్ట్‌ చేసింది. ఇక ఓవర్సీస్‌తో పాటు మిగిలిన ప్రాంతాలలో రూ. 1. 56కోట్లు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. తొలిరోజు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని సినీ వర్గాలు అంచానా వేస్తున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)