Breaking News

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Sun, 04/23/2023 - 12:27

చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్ ఖాతాలో మరో హిట్‌ పడింది. యాక్సిడెంట్‌ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్‌, రూ. 24.60 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ని దక్కించుకుంది.

ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  మొత్తానికి సాయి తేజ్‌ రీఎంట్రీతోనే బిగ్‌ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్‌!)

ఈ చిత్రానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్‌ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్‌  అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. సాయితేజ్‌కి జోడిగా సంయుక్త మీనన్‌ నటించగా.. రాజీవ్‌ కనకాల, సునీల్‌, సాయిచంద్‌, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)