'నాగమ్మ'గా కుంభమేళా మోనాలిసా

Published on Wed, 08/27/2025 - 11:00

మోనాలిసా భోంస్లే (16) పేరు సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్‌ అయింది. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌ను ఊపేసిన నిరుపేద యువతి. అయితే, ఆమె ఫోటోలు వైరల్‌ కావడంతో భారీగా పాపులారిటీ వచ్చింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు, ప్రముఖ టీవీ షోలకు అతిథిగా ఆమె హాజరైంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో సినిమా ఛాన్స్‌ దక్కింది.

మోనాలిసా భోంస్లే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో  ఎంట్రీ ఇచ్చింది.  ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'నాగమ్మ' చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల కొచ్చిలో జరిగింది. దీనికి ప్రఖ్యాత చిత్ర నిర్మాత సిబి మలైల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీని పి. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తుండగా.. జీలి జార్జ్ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం 'నీలతామర'లో మెప్పించిన కైలాష్‌ మోనాలిసాతో నటించనున్నారు. చిత్రనిర్మాతల ప్రకారం, నాగమ్మ షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభం కానుంది.

పూజలో, మోనాలిసా గులాబీ రంగు లెహంగాలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమెకు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పలు షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌తో పాటు కొన్ని యాడ్స్‌లలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం మలయాళ పరిశ్రమ నుంచి ఆమెకు గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కిందని చెప్పవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)