‘బేబీ’తర్వాత అలాంటి పాత్రలే వస్తున్నాయి: విరాజ్‌ అశ్విన్‌

Published on Wed, 12/13/2023 - 16:23

బేబి చిత్రం హిట్ అవుతుంద‌ని అనుకున్నాం. కానీ ప్రేక్ష‌కులు ఇంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తార‌ని అనుకోలేదు. బేబి త‌రువాత చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ చాలా వరకు లవర్‌బాయ్‌ పాత్రలే వస్తున్నాయి. అయితే నేను మాత్రం కథ, నా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్నాను’అని యంగ్‌ హీరో విరాజ్‌ అశ్విన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్‌. అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విరాజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► ఒక హిట్ సినిమా త‌రువాత వ‌స్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుంద‌న‌డానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహ‌ర‌ణ‌. బేబి త‌రువాత వ‌స్తున్న ఈ  సినిమాపై అంద‌రిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. 

► బేబీలో ధ‌నిక యువ‌కుడిగా క‌నిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా  క‌నిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువ‌కుడిగా నాలో చాలా ఎమోష‌న్స్ ఉంటాయి. ఎన్నిక‌ష్టాలున్నా మ‌న‌సులో దాచుకుని బ‌య‌టికి సంతోషంగా క‌నిపించే యువ‌కుడిగా నా పాత్ర అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా ఉంటుంది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్ర‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను.

► ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాద‌ర్ అండ్ స‌న్ ఎమోష‌న్ అంద‌ర్ని క‌ట్టిప‌డేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాద‌ర్ త‌న కొడుకును స‌క్సెస్‌ఫుల్ చేయ‌డానికి ఎలాంటి త్యాగాలు చేశాడు?  ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోష‌న్‌గా ఉంటుంది. 

► ప్ర‌స్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. న‌చ్చిన పాత్ర‌లు, ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా క‌నిపిస్తాను.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)