Breaking News

‘విరాజి’ మూవీ రివ్యూ

Published on Fri, 08/02/2024 - 17:02

టైటిల్‌: విరాజి 
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం: ఆద్యంత్‌ హర్ష
సంగీతం: ఎబినేజర్‌ పాల్‌(ఎబ్బి)
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్‌: రామ్‌ తూము
విడుదల తేది: ఆగస్ట్‌ 2, 2024

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్‌.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్‌ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్‌ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్‌ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి(వరుణ్‌ సందేశ్‌) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ఇదొక విభిన్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్‌ హర్ష. చిన్న పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. 

ఇంటర్వెల్‌కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.  ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.

సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్‌. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు  సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. 

ఇంటర్వెల్ ట్విస్ట్‌ ఆకట్టుకోవడంతో  పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. 

ఎవరెలా చేశారంటే..
ఆండీ పాత్రకు వరుణ్‌ సందేశ్‌ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)