Breaking News

‘వినరో భాగ్యము విష్ణు కథ’ హీరోయిన్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Published on Wed, 02/15/2023 - 21:01

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌ కశ్మీర తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఎలా ఉన్నాయి. 

⇔ మాది మహారాష్ట్ర. రాజ్‌పుత్‌ వంశానికి చెందిన నేను ఫ్యాషన్ డిజైనింగ్‌ చేశాను. నటనపై  ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను. అ క్రమంలోనే 2018లో నాకు నాగశౌర్య నర్తనశాల సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకున్నాను. 

⇔ నర్తనశాల సినిమా తర్వాత నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంలో ఉన్న ఈ సినిమా కథ  వినగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్‌ వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేయడం మరోక ఎత్తు. గీతా ఆర్ట్స్ లో  చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. 

⇔ ఈ సినిమాలో నేను దర్శనగా మంచి స్కోప్ ఉన్న పాత్రలో  నటించాను. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా కొరకు షూటింగ్ మధ్యలో, షూటింగ్  తర్వాత  కూడా  మూవీ ప్రమోషన్ లో భాగంగా మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్‌తో రీల్స్ చేయడం  జరిగింది. దీనివల్ల చాలా ఎంజాయ్ చేశాను 

⇔ నేను మరాఠి అయినా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు సినిమాలు మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్ యాక్సెప్ట్‌లోకి వెళ్లి ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఇలా చేయడం చాలా రిస్క్ అయినా ఛాలెంజింగ్‌గా తీసుకొని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. అయితే మరాఠీ సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడ సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువ రియలిస్టిక్‌ను బేస్ చేసుకొని తీస్తారు. ఈ సినిమా తర్వాత తెలుగులో  ఒక సినిమా  కథ చర్చలు నడుస్తున్నాయి. అలాగే తమిళంలో ఓ సినిమా,  హిందీలో ఓ సినిమా చేస్తున్నాను అని ముగించారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)