Breaking News

‘బలగం’ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఊరి జనం.. వీడియో వైరల్‌

Published on Sun, 04/02/2023 - 13:27

స్టార్‌ హీరోలు నటించలేదు.. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించలేదు.. ఐటం సాంగ్స్‌లేవు.. ఫైట్‌, రొమాన్స్‌ అసలేవు. కానీ ఆ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నా.. థియేటర్స్‌కి బారులు తీస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే టీవిల్లోకి సినిమా వచ్చేస్తుంది. అయినా కూడా ఊరు ఊరంతా రచ్చబండ దగ్గరకు వచ్చి ఆ సినిమాను వీక్షించారు.  తెరపై కనిపించిన పాత్రల్లో తమని తాము ఊహించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మన కథ అంటూ ఎమోషనల్ అవుతున్నారు.ప్రేక్షకులు అంతగా ఓన్‌ చేసుకున్న ఆ సినిమానే ‘బలగం’.

తెలంగాణ పల్లె కుటుంబం నేపథ్యంలో చిన్న చిత్రంగా విడుదలైన బలగం.. భారీ విజయం సాధించింది. విడుదలై నెల రోజులు కావొస్తున్నా..ఇప్పటికీ జనాలు ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. అంతేకాదు పాత కాలంలోలాగా గ్రామాల్లో స్పెషల్‌ షోలు వేస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో రచ్చబండ వద్ద ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఓ గ్రామంలో సినిమా చూస్తూ వృద్ధులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. చీరకొంగుతో కన్నీళ్లుతను తుడుచుకుంటూ సినిమాను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌ అయింది.  ఈ వీడియోపై బలగం హీరో ప్రియదర్శి స్పందించారు. ‘ఇది నా సినిమానేనా?’అంటూ ట్వీట్‌ చేశాడు. కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)