Breaking News

రీరిలీజ్‌.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్‌!

Published on Tue, 07/23/2024 - 17:04

రీరిలీజ్‌ అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్‌ హీరోల బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్‌ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్‌ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు కొన్ని రీరిలీజ్‌ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్‌ హిట్‌ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.

దర్శకధీరుడు రాజమౌళి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత  మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న  ఈ మూవీని రీరిలీజ్‌ చేస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు.

మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. మహేశ్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్‌లో రిలీజ్‌ చేయనున్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్‌ 5, 1989లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడమే కాదు టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్‌లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.

ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్‌ మీనన్‌. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్‌ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ  ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్‌ ముందుకు రాబోతుంది.  ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)