Breaking News

30 నిమిషాల ఫైట్ సీక్వెన్స్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్

Published on Sat, 11/15/2025 - 20:18

దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్‌డేట్ వచ్చేసింది.

'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు  అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.

30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అ‍ప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు