Breaking News

‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్‌

Published on Tue, 04/22/2025 - 17:20

ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో మళ్లీ ఫుల్‌ బిజీ అయ్యారు విజయశాంతి(Vijayashanti). ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా విలేకరులతో ముచ్చటిస్తూ.. మీడియాకు ఓ చిన్న రిక్వెస్ట్‌ చేసింది. ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను ‘నువ్వు’ అని కాకుండా ‘మీరు’ అని సంభోదించాలని కోరారు.

‘సినిమాలకు దూరంగా ఉన్నా.. నేను అన్ని ఫాలో అవుతుంటాను. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు చూస్తుంటాను. ఇక్కడ మీకు(మీడియా) ఓ మాట చెబుతాను తప్పుగా తీసుకోకండి. మీరు(మీడియా) ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను కూడా ‘మీరు’ అని పిలవండి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ హీరోయిన్‌ని అయినా మీరు అనే పిలిస్తే వాళ్లను గౌరవించినట్లు ఉంటుంది. 

(చదవండి: కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి)

హీరోని మీరంతా అలానే పిలుస్తారు కదా.. మరి హీరోయిన్‌ని నువ్వు అని ఎందుకు అంటారు? చదువుకున్న మనం వాళ్లకు గౌరవం ఇవ్వాలి. ముంబై, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు మన టాలీవుడ్‌కి వస్తున్నారు. వారందరిని ‘మీరు’ అని గౌరవిస్తే.. మన గొప్పదనం తెలుస్తుంది. 

నేను కూడా అందరిని మీరు అనే పిలుస్తాను. ఇది నేను ఎన్టీరామారావు దగ్గర నుంచి నేర్చుకున్నాను. సత్యంశివం సినిమా షూటింగ్‌ సమయంలో నన్ను ఆయన మీరు అనే సంభోదించేవారు. ఆయన మనవరాలి వయసు ఉన్న నన్ను కూడా మీరు అని పిలవడం చూసి ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆయనలాగే అందరిని మీరు అని గౌరవించాలకున్నాను.నేను అదే ఫాలో అవుతున్నాను. మీడియా సోదరులు చాలా మంచోళ్లు.. చాలా కష్టపడతారు. హీరోయిన్లను మీరు గౌరవిస్తే.. వాళ్లు కూడా మీతో గౌరవంగా మాట్లాడతారు. నేను చెప్పేది తప్పుగా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్‌ మాత్రమే’అని విజయశాంతి అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)