ఏడాది పాటు డైట్‌ చేశా.. బురద సీన్‌ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి

Published on Wed, 04/23/2025 - 11:08

‘‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా సినిమా రిలీజ్‌ నుంచి ఈరోజు వరకు ఎంతో మంది మహిళలు ఫోన్‌ చేసి, సినిమా చాలా బాగుందని, తల్లీ కొడుకు మధ్య భావోద్వేగాలు కట్టిపడేశాయని చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఓ మంచి చిత్రం చేశాననే సంతృప్తి నాకు, మా యూనిట్‌కి కలిగింది’’ అని నటి విజయశాంతి చెప్పారు. కల్యాణ్‌ రామ్, సయీ మంజ్రేకర్‌ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు. 

→ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత కొన్ని తెలుగు, తమిళ కథలు విన్నాను. కానీ, ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోవడం వల్ల గ్యాప్‌ వచ్చింది. ప్రదీప్‌ చిలుకూరిగారు ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ కథ చెప్పినప్పుడు తల్లి, కొడుకు మధ్య భావోద్వేగాలు నన్ను బాగా ఎగ్జయిట్‌ చేయడంతో వెంటనే ఓకే చెప్పాను. 

→ పోలీస్‌గా, తల్లిగా చాలా విరామం తర్వాత ఒక పవర్‌ఫుల్‌ పాత్ర చేశాను. ప్రజలు రాములమ్మని (విజయశాంతి) ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్‌ఫిల్‌ అయ్యింది. ఈ సినిమాలో బురద సన్నివేశం చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్‌ పాటించాను. అలాగే పాత్ర కోసం నిరంతరం వ్యాయామం చేశాను. ఇప్పుడు యాక్షన్‌ చేయడం అనేది ఒక రకంగా నాకు సవాల్‌తో కూడుకున్నదైనా చేశాను. 

→ యాక్షన్, పెర్ఫార్మెన్స్‌ని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వారు అభినందిస్తుండటం హ్యాపీగా ఉంది.  ఈ సినిమాతో తల్లి, కొడుకుగా నాకు, కల్యాణ్‌ రామ్‌కి మంచి అనుబంధం ఏర్పడింది.

→ నా కెరీర్‌ మొదట్నుంచీ నా ట్రాక్‌ సెపరేట్‌. ‘ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్లాం’... ఇలా ఎన్నో  వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఇన్ని రక రకాల పాత్రలు చేయడం నాకు కుదిరింది. అది దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తా. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించాను... ఆశీర్వదించి సింహాసనంపై కూర్చోబెట్టారు. ‘ప్రతిఘటన’ సినిమా తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ప్రజల నుంచే వచ్చింది. అలాగే ‘లేడీ జాకీ చాన్, లేడీ అమితాబ్‌’ ఇలా పిలిచారు. నేటి తరం యువత కూడా నన్ను రాములమ్మ అని పిలుస్తుంటే ఆశ్చర్యపోతుంటాను. మీ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నేచర్‌ని మేం స్ఫూర్తిగా తీసుకుంటున్నామని వారు చెప్పినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది.   

→ హీరోయిన్లను మీరు అనండి: ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు, వీడియోలు చూశాను. కొంతమంది మీడియా మిత్రులు హీరోలను మీరు అని, హీరోయిన్లను మాత్రం నువ్వు అని సంబోధిస్తున్నారు. అలా అగౌరవంగా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్‌? నందమూరి తారక రామారావుగారిలాంటి స్టార్‌ హీరో ఆయన మనవరాలి వయసున్న నన్ను సెట్స్‌లో మీరు అని మాట్లాడేవారు. అది మన సంస్కారం. తెలుగు వారు కానీ, ఏ ్ర΄ాంతం నుంచి వచ్చిన హీరోయిన్లను అయినా కానీ మీరు అని సంబోధించండి. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)