Breaking News

‘వారసుడు డైలీ సీరియల్‌’.. ట్రోలర్స్‌పై వంశీ పైడిపల్లి ఫైర్

Published on Tue, 01/17/2023 - 21:57

తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘వారసుడు’ డైలీ సీరియల్‌ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 

అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమా డైలీ సీరియల్‌ను తలపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ పోస్టులపై వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు.' అంటూ ఫైరయ్యారు వంశీ. 

వంశీ మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానిక్ మేం పడే కష్టం ఎలా ఉంటుందో  మీకు తెలుసా? ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మనదేశంలో సూపర్‌స్టార్స్‌లో విజయ్‌ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్‌ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా. మరీ ఇంత నెగెటివ్‌గా ఉండకండి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికే మూవీ చేశా.' అని అన్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు