Breaking News

ఆ మూవీ నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా!

Published on Tue, 02/21/2023 - 08:35

సుందర్‌ సీ దర్శకుడిగా, నటుడిగా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన కాఫీ విత్‌ కాదల్‌ చిత్రం యూత్‌ను బాగానే ఆలరించింది. ఇప్పుడు ఓ హార్రర్‌ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు రెడీ అయ్యారు. గతంలో ఆయన దర్శకత్వం వహించి ముఖ్య పాత్ర పోషించిన అరణ్మణై పార్ట్‌ 1, పార్ట్‌ 2, పార్ట్‌ 3 చిత్రాలు మంచి విజయాన్ని పొందడంతో తాజాగా వాటికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు  చేస్తున్నారు. ఇది కూడా హార్రర్‌ జానర్‌లో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.

చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!

కాగా ఇందులో విజయ్‌ సేతుపతి, సంతానం కథానాయకులుగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్‌ సేతుపతి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన తెలుగు, తమిళం, హిందీ, భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో కాల్‌ షీట్స్‌ సమస్య తలెత్తడంతో అరణ్మణై 4 చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో ఆయన పాత్రలో సుందర్‌.సీనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అవ్నీ సినిమా పతాకంపై నటి కుష్బూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.   

చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)