Breaking News

ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్‌ సేతుపతి

Published on Mon, 07/17/2023 - 05:55

‘‘షారుక్‌ ఖాన్‌ కోసమే ‘జవాన్‌’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సంతోష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్‌ 2) విడుదలైంది.

ప్రస్తుతం ఆయన షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్‌’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్‌ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్‌’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్‌ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్‌’ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్‌ కుమార్‌ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ (2019) లో విజయ్‌ సేతుపతి నటనపై షారుక్‌ ఖాన్‌ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)