Breaking News

రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్‌పాట్!

Published on Wed, 07/31/2024 - 12:45

కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.

పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ ‪‌పాట్ కొట్టేసినట్లే!

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)