విజయ్ సేతుపతి హీరోగా మూకీ సినిమా.. టీజర్ రిలీజ్

Published on Sat, 01/03/2026 - 14:32

తమిళ నటుడు విజయ్ సేతుపతి దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఏస్, తలైవన్ తలైవి లాంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు సడన్‌గా ఓ మూకీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.

'గాంధీ టాక్స్' పేరుతో తీస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానని విజయ్ సేతుపతి.. అప్పుడెప్పుడో 2021లో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. 2023 నవంబరులో గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత మళ్లీ సైలెంట్. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజరో ట్రైలరో తెలీదు గానీ 80 సెకన్ల వీడియోని రిలీజ్ చేసి థియేటర్లలోకి ఎ‍ప్పుడొస్తుందనే విషయాన్ని ప్రకటించారు. మూకీ సినిమాని ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనేది చూడాలి?

Videos

Tirupati: సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ మోహనకృష్ణపై కేసు

రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్

Japan : రూ. 30 కోట్ల పలికిన 243 కేజీల ట్యూనా చేప

ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్‌ను పట్టుకున్న పోలీసులు

సీమకు చంద్రగ్రహణం లోక్ సభలో అవినాష్ రెడ్డి ఫైర్

తాగిన మైకంలో పాముతో హల్చల్

కోరంగి చేరిన విదేశీ పక్షులు

Garam Garam Varthalu: వామ్మో ఏంది ఇది..

Garam Garam Varthalu: ఫ్రీ బస్సులో కూరగాయలు కోసుకుంటున్న మహిళలు

ఉత్తరాదికి IMD హెచ్చరిక

Photos

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే

+5

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్‌

+5

బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)