Breaking News

ఓటింగ్‌ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన స్టార్‌ హీరో

Published on Fri, 04/19/2024 - 14:44

తమిళనాడులో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్‌ ప్రముఖ హీరోలు క్యూ కట్టారు. సెలబ్రిటీలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూలలో నిలబడి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, నటుడు ధనుష్, నటుడు విక్రమ్ వంటి ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉన్న  విజయ్ కూడా ఈరోజు తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. చేతికి చిన్న గాయంతో కనిపించిన  విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

ఈ సందర్భంలో కోలివుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్‌లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్‌ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్‌ ఉన్న నటుడు అని ఆమె కొనియాడింది. దీంతో వెంటనే విజయ్‌ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది అభిమానులు ఆయనతో  కరచాలనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)