Breaking News

కొడుకు వీడియో వైరల్‌.. క్షమాపణలు చెప్పిన విజయ్‌ సేతుపతి!

Published on Sat, 07/05/2025 - 17:34

కొడుకు సూర్య వైరల్‌ వీడియో వివాదంపై తమిళ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) స్పందించాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అని మీడియా ముఖంగా తెలియజేశాడు. విజయ్‌ సేతుపతి కొడుకు సూర్య(Surya) హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫీనిక్స్‌’ జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్‌ సంపాదించుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్‌ షోనే వివాదస్పదంగా మారింది. సూర్యకు సంబంధించిన వీడియోలను డిలీట్‌ చేయాలని అతని టీమ్‌ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ వివాదంపై విజయ్‌ సేతుపతి స్పందించాడు. 

‘సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది తెలియకుండా జరిగి ఉండవచ్చు లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విష‌యంలో ఎవరైనా బాధపడితే వారిని నా తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని విజయ్‌ సేతుపతి అన్నారు.

ఫినిక్స్‌ విషయానికొస్తే..ఇదొక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 4న విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసలు అయితే భారీగానే వచ్చాయి కానీ కలెక్షన్స్‌ మాత్రం పెద్దగా రాలేదు. పోటీలో సిద్ధార్థ్‌ 3బీహెచ్‌కే తో పాటు మరో సినిమా ఉండడం వల్లే.. తొలిరోజు ఫినిక్స్‌కి అతి తక్కువ(రూ. 10 లక్షలు) వసూళ్లు వచ్చాయి. వారంతంలో కలెక్షన్స్‌ పెరిగే చాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విజయ్‌ సేతుపతి విషయానికొస్తే.. ఇటీవల ఏస్‌ చిత్రంలో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘తలైవన్ తలైవీ’ సినిమా చేస్తున్నాడు.  ఈ చిత్రంలో నిత్యా మీనన్, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)