Breaking News

రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..

Published on Thu, 06/08/2023 - 08:45

రాజకీయ అరంగ్రేటంలో భాగంగా దళపతి విజయ్‌ మరో అడుగు ముందుకు వేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నట్లు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇటీవల కాలంగా సేవలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో ఈనెల 17వ తేదీన పది, ప్లస్‌– 2లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీకి విజయ్‌ సిద్ధమయ్యారు.

(ఇది చదవండి: పాపం ఐదేళ్లకే మతిపోయింది.. మెడిసిన్ వాడాల్సిందేనన్న డైరెక్టర్!)

నేపథ్యం ఇదీ..
సినీ నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే విజయ్‌ ఇటీవల కాలంగా వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్‌ అప్పుడప్పుడూ బీజీగానే ఉన్నారు.

అలాగే, ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. అలాగే, దివంగతులైన నేతల జయంతి కార్యక్రమాలను, ముఖ్య కార్యక్రమాలను అభిమానుల ద్వారా చేయిస్తున్నారు. అలాగే విజయ్‌ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్థి విభాగాలను సైతం ఏర్పాటు చేసి ఉండడంతో రాజకీయ అరంగ్రేటానికి సమయం సమీపించిందనే చర్చ జోరందుకుంది. ఈ సమయంలో విజయ్‌ విద్యార్థులతో సంప్రదింపులకు సిద్ధమయ్యారు.

( ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!)

ఇటీవల వెలువడ్డ పది, ప్లస్‌–2 ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని పిలిపించి, సత్కరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ సమావేశం కావాలని విజయ్‌ నిర్ణయించడం గమనార్హం. ఈనెల 17న ఈసీఆర్‌లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)