Breaking News

'భగవంత్‌ కేసరి' రీమేక్‌.. ఆ ఒక్క సీన్‌ కోసం పట్టుబట్టిన విజయ్‌

Published on Mon, 05/19/2025 - 13:22

‘భగవంత్‌ కేసరి’ని దళపతి విజయ్‌ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్‌ అయ్యారు.  బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను జననాయగన్‌ పేరుతో తమిళ్‌లో విజయ్‌ దళపతి రీమేక్‌ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్‌ అంశం గురించి తాజాగా మరో ​కొత్త విషయం బయటకొచ్చింది.

విజయ్‌ కొత్త సినిమా 'జన నాయగన్‌' కోసం ‘భగవంత్‌ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్‌ను జన నాయగన్‌లో విజయ్‌ రీక్రియేట్‌ చేశాడని సమాచారం. ఈ సీన్‌ మాత్రమే రీమేక్‌ అని, మిగతాది అంతా భగవంత్‌ కేసరితో జన నాయగన్‌ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్‌ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  

భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్‌ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్‌ కోసం జగ నాయగన్‌ టీమ్‌ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్‌. ఈ సీన్‌ మహిళలకు బాగా కనెక్ట్‌ అవుతుందని విజయ్‌ భావించాడట.  పొలిటికల్‌గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)