Breaking News

ఒక రోజు రష్మికను చాలా మిస్‌ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తూ విజయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Thu, 02/26/2026 - 19:15

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.

వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్‌ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి

ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ

బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు

జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Tatiparthi Chandrasekhar : వెలిగొండలో బాబు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్

తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు

Photos

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)