Breaking News

విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?

Published on Wed, 03/04/2026 - 12:40

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్‌లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.

(ఇదీ చదవండి: విరోష్‌... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్‌ సెట్టర్‌..)

Videos

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)