Breaking News

జీవితంలో ఎవరికైనా ఆ మూడే ముఖ్యం : విజయ్‌ దేవరకొండ

Published on Sat, 03/23/2024 - 14:03

జీవితంలో ఎవరికైనా ఆరోగ్యం, ఆనందం, డబ్బు.. ఈ మూడే చాలా ముఖ్యమని అన్నారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్వంలో నిర్వహించిన  హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టుల అందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్‌ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

‘జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల సెల‌బ్రేష‌న్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు.నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లులు ఎక్కువ వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి డ‌బ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వ‌దిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ యుటిలైజ్ చేసుకుంటున్నార‌ని తెలిసి ఆనందంగా అనిపించింది’ అన్నారు. 

సినిమాల విషయానికొస్తే.. విజయ్‌ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌. గీతగోవిందం లాంటి బ్లాస్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌తో పరుశురామ్‌ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)